నృసింహుని ఏకాదశ మాలాధారణ దీక్ష స్వీకరణ

నృసింహుని ఏకాదశ మాలాధారణ దీక్ష స్వీకరణ
మంగళగిరి ప్రతినిధి మార్చి 4 యువతరం న్యూస్:
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఎగువ సన్నిధిలోని శ్రీ పానకాల స్వామి వారి ముఖ మండపంపై మంగళవారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలాధారణ దీక్ష స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. దేవస్థానం ప్రధాన అర్చకులు, గురుస్వామి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు భక్తులకు మాల వేసి దీక్ష ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్ల సేవా ట్రస్ట్ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు మాలాధారణ దీక్ష స్వీకరించే భక్తులకు దీక్ష వస్త్రాలను ఉచితంగా అందజేశారు. సుమారు 200 మంది భక్తులకు వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, న్యాయవాది రంగిశెట్టి లక్ష్మి మాట్లాడారు. దేవాలయంలో దీక్షలు సుమారు పదిమందితో ప్రారంభమై, నేడు 600 మంది పైగా భక్తులు దీక్షల స్వీకరిస్తున్నారన్నారు. తోట శ్రీనివాసరావు సుమారు 17 సంవత్సరాల నుంచి నరసింహని మాలాధారణ దీక్ష స్వీకరించే భక్తులకు ఉచితంగా దీక్ష వస్త్రాలు పంపిణీ చేస్తూ, వారికి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయం ఆవరణలో అల్పాహారం, భోజనం( సద్ది) ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి గురుస్వామి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గోగినేని వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ప్రతినిధి సైదా నాయక్, శివాలయం మాజీ ధర్మకర్త అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, భక్త బృందం ప్రతినిధులు బుర్రి సతీష్ ,హనుమంత నాయక్,మాదల గోపి, సారమేకల బాబి, సుబాని, చింకా మహేష్, చింకా లవణ్ కృష్ణ, రుద్రు వినయ్, పేరుబోయిన కోటేశ్వరరావు, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.