ANDHRA PRADESHDEVOTIONALWORLD
శేషు వాహనంపై మల్లేశ్వరుడు

శేషు వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి ప్రతినిధి ఫిబ్రవరి 21 యువతరం న్యూస్:
మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైనా గురువారం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజారి మహేష్ కుమార్ శర్మ, పురోహితులు శ్యామ సుందర శాస్త్రి పూజలు నిర్వహించారు. ఉత్సవానికి పట్టణానికి చెందిన గోలి పున్నారావు, నాగేశ్వరరావు, సాంబశివరావు, శ్రీనివాసరావు కైంకర్యాపరులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో శివాలయం, సీతారామ కోవెల మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు బోగి కోటేశ్వరరావు, వాకా మంగారావు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం ఈవో జేవీ నారాయణ పర్యవేక్షించారు.