తల్లికి వందనం అమలుకు ముహూర్తం పిక్స్

త్వరలో తల్లికి వందనం
నెల్లూరు ప్రతినిధి జనవరి 24 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఒక ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ.. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న వారందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి స్వామి తల్లికి వందనం పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే పలు హామీలను నిలబెట్టుకోగా.. తాజాగా సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. తాజాగా మరో పథకం అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఈ మేరకు మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సరే.. సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. మంత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.. అక్కడ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు.
సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన తల్లికి వందనం పథకంపై మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని ఈ ఏడాది మే నెల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.. ఈ మేరకు కసరత్తు జరుగుతోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే రూ.4వేలు పింఛన్ అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఆరు నెలలైందని.. తమ చేతిలో మంత్రదండం ఏమీ లేదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా సరే తిరిగి పునర్ నిర్మాణాన్ని చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటి నిలబెట్టుకుంటున్నామన్నారు. పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించేవారికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కూటమి తల్లికి వందనం కార్యక్రమంపై హామీ ఇచ్చింది.. అర్హత ఉండి బడికి వెళ్లే విద్యార్థలకు ఒక్కొక్కరికి ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి స్వామి కీలకమైన ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి సూపర్-6 పథకాలను ప్రకటించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 వంటి పథకాలపై కసరత్తు చేస్తోంది. త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేసి పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు ఇటీవల బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే తల్లికి వందనం పథకంపై మాత్రం మంత్రి క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ప్రతి ఏటా ఒక్కో విద్యార్థికి రూ.10వేలు అందించేవారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం పేరుతో రూ.15వేలకు పెంచింది. ఇప్పుడు ఈ పథకం అమలు కోసం కసరత్తు చేస్తోంది.. త్వరలోనే మార్గ దర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.