చిరు వ్యాపారస్తులు ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా వ్యాపారాలు చేసుకోవాలి

చిరు వ్యాపారస్తులు ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా వ్యాపారలు చేసుకోవాలి
వ్యాపారస్తులు రోడ్ల పక్కన నిర్దేశించిన ఇచ్చిన మార్జిన్లో మాత్రమే వ్యాపారం చేసుకోవాలి
ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించి ఆటోలను నడపాలి
ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
ఆటోలో పరిమితికి మించి జనాన్ని ఎక్కించకూడదు
డ్రైవర్ కు అటూ ఇటూ ఎవరిని ఎక్కించకూడదు
డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం
ఆటో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదు
మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్
మంగళగిరి ప్రతినిధి జనవరి 6 యువతరం న్యూస్:
చిరు వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేయకూడదని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకూడదనీ మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. మంగళగిరి ఎన్ఆర్ఐ వై జంక్షన్ వద్ద సోమవారం సాయంత్రం రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్డు వెంబడి చిరు వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులు వారిని కలిసి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా ఉండాలని ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వారిపై కేసులో నమోదు చేయడం జరుగుతుందని ఎస్ఐ వెంకట్ హెచ్చరించారు. వ్యాపారస్తులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే బండ్లను పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలని వారికి సూచించారు. అలాగే ఆటో డ్రైవర్లు కూడా విధిగా యూనిఫామ్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారు మాత్రమే ఆటో డ్రైవ్ చేయాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు వారి పక్కన అటూ ఇటూ ఎవరిని కూర్చోబెట్టకుండా ఉండాలని, అధిక జనంతో ఆటో నడపడం వల్ల అదుపుతప్పి వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని ఆటో డ్రైవర్లు పరిమితికి మించి జనాన్ని ఆటోలో ఎక్కించకుండా ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఎన్నారై వైజంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లకు ఎస్సై సిహెచ్ వెంకట్, కౌన్సిలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు.అదేవిధంగా మద్యం సేవించి ఆటో డ్రైవర్లు వాహనాలు నడపరాదని అలా నడిపిన యెడల వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని వెంకట్ హెచ్చరించారు.