డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఇదెక్కడి తనిఖీలు….

డ్రగ్ ఇన్స్పెక్టర్ గారూ ఇదెక్కడి తనిఖీలు..
మీకోసమే తనిఖీలా … ప్రజల ప్రాణాల కోసం కాదా..?
దేవనకొండ జనవరి 6 యువతరం న్యూస్:
మండల కేంద్రంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్వీన్ షేక్ తనిఖీలు నిర్వహించారు. మెడికల్ షాపులు 13 పైగా ఉండగా రెండు మూడు షాపులు తప్ప మెడికల్ షాప్ యాజమానులు డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలకు భయపడి మెడికల్ షాపులను బంద్ చేసుకున్నారు. విషయాన్ని గమనించిన ప్రజలు రోగులకు ఇచ్చే మెడిసిన్స్ సరైనవి కానందునే మెడికల్ షాప్ యజమానులు షాపులను బందు చేసుకొని ఉండచ్చని గుసగుసలాడారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న విలేకరులు డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్వీన్ షేక్ ను తనిఖీలు గురించి సమాచారం ఇవ్వండి అని అడగగా తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. తూతూ మంత్రంగా చేసే తనిఖీలు ఎప్పుడూ చూడలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మెడికల్ షాప్ లలో సరైన మందులు ఉన్నాయా లేదా తెలుసుకోకుండా మరియు ప్రజల ప్రాణాలు కాపాడటానికి మెడికల్ షాపులను పూర్తిస్థాయిలో తనిఖీలు చేయకుండా కేవలం ఆమె సౌలభ్యం కోసమే తనిఖీలు చేసుకుని వెళ్లిపోతున్నారని మండల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.