ANDHRA PRADESHFILMMOVIESWORLD

తెలుగు సినీ ఆకాశంలో ధృవతార మహానటి సావిత్రి

తెలుగు సినీ ఆకాశంలో దృవతార మహానటి సావిత్రి

అమలాపురం ప్రతినిధి డిసెంబర్ 27 యువతరం న్యూస్:

తెలుగు సినీ రంగంలో ఒక శాశ్వత చిరునామా నట శిఖరం మహానటి సావిత్రి
వెండి తెరపై వెన్నెల లు కురిపించి
తెలుగుపేక్షకుల హృదయాలలో ఆనందాన్ని నింపి
అ సామాన్య నటనతో
చిత్ర పరిశ్రమలో చందమామలా వెలిగిన మహానటి సావిత్రి/
చిత్రజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం పెళ్లిచేసి చూడు
దేవదాసు చిత్రం ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు/
మిస్సమ్మ చిత్రంలోని నటన అపూర్వం అద్వితీయం/
గొప్ప మానవీయ గుణాలు కలిగిన స్త్రీ మూర్తి సావిత్రి
నటనలో భావోద్వేకాలు పాత్ర పై ప్రేమ అంకితభావం సినీ పరిశ్రమ ఆమెచేసిన సేవలు అపూర్వ అద్వితీయం తెలుగు సినీ రంగంలో అజరామరం /
సావిత్రి 1936 డిసెంబర్ 6వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో జన్మించింది చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ఆమె కుటుంబానికి ఇబ్బందులు కలిగాయి
చిన్నతనం నుండి ఆమెకు నాటకాలలో నటించడం అంటే మక్కువ ఎక్కువ అందుకే తల్లి ప్రోత్సాహంతో నటనా రంగంలోకి అడుగు పెట్టింది/
తొలిసారిగాసినిమాల్లోకి అడుగుపెట్టగానే చిన్న చిన్న పాత్రలు లభించాయి
1950వ సంవత్సరంలో సంసారం అనేసినిమాలో నటించి సినీ రంగం తోపరిచయం ఏర్పడింది/
నిజమైన గుర్తింపు 19 52 లో విడుదలైన పెళ్లి చేసి చూడు చిత్రంతో ఆమెకు వచ్చింది/
ఆ తర్వాత ఆమె నటనకు పట్టం కట్టిన చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ముఖ్యంగా దేవదాసు మాయాబజార్ గుండమ్మ కథ చివరికి మిగిలేది వంటి చలనచిత్రాలు ఆమె నటన తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది అందరూ హృదయాల్లో ఆమె నటిగా ముద్ర వేసుకున్నారు/
అభినయం ప్రాణశక్తి
కళ్ళతో నటించడం
పాత్ర స్వరూప స్వభావం ఆకట్టుకుని నటించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య/
ఆమె నవరసాలను సజీవంగా అద్భుతంగా వ్యక్తీకరించగల సహజ నటి మహానటి/
మాయాబజార్ చిత్రంలోని చూపిన హాస్యం దేవదాసు చిత్రం లో పార్వతి పాత్రలో చూపిన ప్రేమ విరహం లాంటిది తెలుగు సినీ ప్రేక్షకులహృదయాల్లో చెరగని ముద్ర వేసింది/
సావిత్రి సుమారు 300 చిత్రాల్లో నటించింది తెలుగు మాత్రమే కాకుండా తమిళం, తమిళం మలయాళం హిందీ భాషల్లో నటించి తన ప్రతిభను చూపారు/ ప్రేక్షకులు మహానటిగా నీరాజనాలు పలికారు ఆమెకు ఎన్నో పునస్కారాలు లభించాయి ముఖ్యంగా 1960లోచివరకు మిగిలేది సినిమాకి ఉత్తమ నటి జాతీయ అవార్డు 1968లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఘనంగా సన్మానించింది/
2018లో సావిత్రి జీవితం ఆధారంగా మహానటి సినిమా ఆమె జీవితానికి అద్దం పట్టింది/
ఆమె జీవితం కష్టాలను ఎదుర్కొనే ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది
సావిత్రి తెలుగు మహానటిగా సినీ చరిత్రలో సినీ ప్రేక్షకుల హృదయాలలో చిగురిస్తూనే ఉంటుంది
జనం గుండెల్లో దీపమై వెలుగుతూనే ఉంటుంది/

డాక్టర్ నల్లా నరసింహమూర్తి
సీనియర్ తెలుగు లెక్చరర్
శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు అధ్యాపక సంఘం గౌరవ ఉపాధ్యక్షులు

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!