AGRICULTUREANDHRA PRADESHOFFICIALSTATE NEWS
ధాన్యం సేకరణలో ఎక్కడ తప్పు జరగడానికి వీల్లేదు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ధాన్యం సేకరణలో ఎక్కడ తప్పు జరగడానికి వీల్లేదు
పెనమలూరు ప్రతినిధి డిసెంబర్ 21 యువతరం న్యూస్:
ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించారు. రైతుల నుంచి ధాన్య సేకరణ ఎలా చేస్తున్నారో సీఎంకు రైతు సేవాకేంద్రం సిబ్బంది వివరించారు. అనంతరం తాము ధాన్యం ఎలా అమ్ముతున్నది సీఎంకు రైతులు వివరించారు. రైతులు ఏ పంటలు వేయాలి? ఏవి లాభసాటిగా ఉంటాయి? అనే అంశాలను అధికారులు రైతులకు వివరించాలని సీఎం సూచించారు.