ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ,పాఠశాలలు సెలవులు

అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలు,కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టల్స్ లకు సెలవు: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల అక్టోబర్ 16 న్యూస్:
నంద్యాల జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో అక్టోబర్ 16వ తేదీ బుధవారం అన్ని ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలలు,కళాశాలలు,అంగన్వాడీ కేంద్రాలు,హాస్టల్స్ లకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 08514 – 293903, 08514 – 293908 ను ఏర్పాటు చేసామని 24 గంటల పాటు మూడు షిఫ్ట్ లలో సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు స్థానికంగా నివాసం ఉండి అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసామన్నారు.వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె సూచించారు. గ్రామాల్లో ఉన్న మట్టి మిద్దెలు,సంక్షేమ వసతి గృహాలు, పాఠశాల భవనాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.