రోడ్డు లేక నక్కల మామిడి గ్రామస్తుల అవస్థలు

నక్కుల మామిడి గ్రామస్తులు రోడ్డు లేక తివ్ర ఇందులు ఈ గ్రామాని అదికారులు నాయకులు పట్టించుకోర
జి మాడుగుల అక్టోబర్ 13
యువతరం న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీ నక్కు లమామిడి గ్రామానికి చెందిన పి వి టి జి తెగ కు చెందిన గిరిజన ప్రజలు రోడ్డు లేక తీవ్ర ఇందులు పడుతున్నారు. మా గ్రామంలో సుమారు 60 కుటుంబాలు నివసిస్తుము మా నక్కులమామిడి గ్రామాము నుంచి పందిరిమామిడి వరకు ఆరు కిలోమీటర్ల దూరంలో రోడ్డు లేక చాలా ఇబందులు పడుచున్నాము అని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు.
రోడ్డు విషయమై గ్రామ సభ లకి అధికారులకు, నాయకులను దరఖాస్తు రూపములో ఫిర్యాదు చెందినప్పటికీ
ఎటువంటి అదికారులు నుండి నాయకులు నుంచి స్పందన లెదు అని స్థానికులు గ్రామస్తులు అన్నారు.
గత వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో దరఖాస్తులు పెట్టి ఆఫీసులు చుట్టూ తిరిగాము అయినా మా గ్రామానికి రోడ్డు మంజూరు చేయలేదు అని వాపోయారు.
మా పంచాయతీలో పక్కపక్క గ్రామాలకు కూడా రోడ్లు శాంక్షన్ అవుతుంటే మా గ్రామానికి మాత్రం
ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లేదు మేమేం పాపం చేశాం,
మమ్మల్ని గుర్తించండి మా శ్రమను గుర్తించి మాకు రోడ్డు నిర్మించి ఇవ్వాలని అధికారులను కోరుకుంటున్నమన్నారు.
రోగులను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలన్న 6 కిలోమీటర్లు డోలిమతలు తో పందిరి మామిడి వరకు తీసుకుని వెళ్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.
గర్భిణీ స్త్రీలను, ఎమర్జెన్సీ రోగులను
డోలిమత్తులతో ఆసుపత్రికి తీసుకెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటాం అని వాపోతున్నారు.
ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు విషయమై నాయకులను అధికారులను అడుగుతుంటే పట్టించుకోవట్లేదు అని గ్రామస్తుల న్నారు.
ఈ కూటమి ప్రభుత్వం అయినా మా గ్రామాన్ని కి రోడ్డు మంజూరు చేయాలని వెంటనే మా గ్రామానికి అధికారులను సందర్శించడానికి పంపించాలని కోరుకుంటున్నాము అని అన్నారు.
స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ పీవీటి జి తెగకు చెందిన గిరిజన బిడ్డలు గ్రామాలు మాత్రం రోడ్డు లేక మంచినీరు సౌకర్యం లేక డోలుమూతలు మోసుకొస్తూ కలుషితమైన నీరు తాగుతూ రోగులు బారిన పడి మలేరియా టైపాడ్ లతో చనిపోతూ ఉన్నారు అని అన్నారు.
వెంటనే మా గ్రామానికి అధికారులు సందర్శించి రోడ్డు శాంక్షన్ చేసి వేగవంతంగా రోడ్డు నిర్మాణ పనులు చేయాలని అధికారులను కోరుకుంటున్నాము అని స్థానిక గ్రామస్తులు కోరారు.
దయచేసి మా బాధను మా శ్రమలను మేము పడుతున్న కష్టాలను అర్థం చేసుకొని రోడ్డు విషయమై మా గోడును అధికారులకు వినబడేలా గొంతెత్తి అరుస్తూ రోడ్డు నిర్మించి మాకు న్యాయం చేయండి అంటూ అధికారులను కోరుకుంటున్నాము అని అన్నారు