ANDHRA PRADESHOFFICIAL

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయండి

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయండి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల కలెక్టరేట్ అక్టోబర్ 04 యువతరం న్యూస్:

ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇళ్ల నిర్మాణాలో ఆశించిన ప్రగతి కనబడడం లేదని పనితీరు మెరుగుపరచుకొని వచ్చే వారానికి పురోగతి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి హౌసింగ్ ఏఈ, డిఇ లను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, ఈఈ శ్రీహరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఉపాధి పని దినాలను అనుసంధానం చేసి వచ్చే వారానికి గృహ నిర్మాణాల ప్రగతి తీసుకరావాలన్నారు. గృహ నిర్మాణాలన్నీ ప్రతివారం స్టేజ్ కన్వర్షన్ స్థాయిలో ఉండాలన్నారు. వచ్చే వారానికి 125 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని  చెబుతున్నారో సంబంధిత లక్ష్యంపైనే తాను సమీక్ష నిర్వహిస్తానన్నారు.ఆళ్లగడ్డలో 16, సంజామల 10, రుద్రవరం 10, అవుకు 10, సిరివెళ్ల 5, బండి ఆత్మకూరు 6, ప్యాపిలి 5, కొలిమిగుండ్ల 5, బేతంచర్ల 6, నందికొట్కూరు 6, దొర్నిపాడు 5, గడివేముల 5, ఉయ్యాలవాడ 5, చాగలమర్రి 5 తదితర మండలాలలో డీఈలు పూర్తి చేస్తామన్న ఇళ్ల నిర్మాణాలపైనే సమీక్షిస్తానన్నారు. రుద్రవరం, పాములపాడు, గడివేముల, ప్యాపిలి తదితర మండలాలు 30 శాతం కన్న తక్కువగా పురోగతి ఉందని సంబంధిత ఏఈ, డీఈలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కాని పనులు చేయమని చెప్పడం లేదని జిల్లా ప్రగతి దిగువ స్థానంలో వున్నందున సాకులు చెప్పకుండా ప్రగతి కనపర్చాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. గృహ నిర్మాణాలపై ఎంపీడీవోలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పునాది స్థాయిలో 50 ఉపాధి హామీ పని దినాలు, రూఫ్ స్థాయిలో 40 ఉపాధి హామీ పని దినాలు కల్పిస్తే వేతన రేటు కూడా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పూర్తి అయిన ఇళ్లకు 68 శాతం మేరనే వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయని మిగిలిన వాటికి కూడా వెంటనే పూర్తి చేయించాలన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!