ANDHRA PRADESHDEVELOPOFFICIAL

ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పత్తికొండ ఆగస్టు 31 యువతరం న్యూస్:

టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జాతరను తలపించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందని పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ అన్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం రామచంద్రపురం గ్రామంలో వృద్ధులు,వికలాంగులు, వితంతువులకు ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పెన్షన్ ను లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి  ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జాతరను తలపించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందని పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్  అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్  మాట్లాడుతూ గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్‌ని చంద్రబాబు నాయుడు 2000 చేశారు అని అన్నారు . జగన్ రెండు వేల పెన్షన్ను 3000 చేస్తానని మాట ఇచ్చి మడమతిప్పరు అని అన్నారు . 250 రు ప్రకారం వంతులవారీగా నాలుగు సంవత్సరాల తర్వాత 3000 చేశారు అని అన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని పెన్షన్ ను లబ్ధిదారుల ఇంటి దగ్గర పంపిణీ చేసాం . తెలుగుదేశం పార్టీది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసి ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!
09:10