ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

వినియోగదారులకు ఉచితంగా ఇసుక

వినియోగదారులకు ఉచితంగా ఇసుక

సమాచారం, ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెం. 08514 242011, ఇమెయిల్: dmgonandyalsandcomplaints@gmail.com

అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల కలెక్టరేట్ ఆగస్టు 25 యువతరం న్యూస్:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిణీ ప్రక్రియలో భాగంగా అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి నియంత్రణలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధాన పటిష్ట అమలుపై జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్, జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ తో కలిసి జిల్లాస్థాయి స్టాండ్ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గనుల శాఖ ఏడి రామచంద్ర, నంద్యాల ఆర్డిఓ మల్లికార్జున రెడ్డి, డిటిసి శివారెడ్డి, కేసీ కెనాల్ ఈఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.*

*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోందని, నంద్యాల జిల్లాలో ఇసుక నిల్వలు, స్టాక్ పాయింట్ లు లేని కారణంగా సమీప జిల్లాలైన కర్నూలు జిల్లాలోని సి.బెళగల్ మండలంలోని సుంకేసుల బ్యారేజీ, కడప జిల్లాలోని కొండాపురంలలో నిల్వ ఉన్న స్టాక్ పాయింట్ ల నుండి లోడింగ్, రవాణా చార్జీలతో వినియోగదారులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. స్టాక్ పాయింట్ ల నుండి ఇసుక రవాణా చేసుకునేందుకు 123 (ఆరు టైర్లు, 10 టైర్లు) వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని… రవాణా చార్జీల భారాన్ని నెగోషియేట్ చేసి తగ్గించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రవాణా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఉచిత ఇసుక సరఫరా సంబందిత అంశాలకు సంబంధించి. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెం. 08514 242011 నెంబర్ కు కాల్ చేసి సమాచారాన్ని స్వీకరించవచ్చన్నారు.అలాగే dmgonandyalsandcomplaints@gmail.com ఈమెయిల్ కూడా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కొలిమిగుండ్ల, బేతంచర్ల, డోన్ చెక్ పోస్ట్ లతో పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చాగలమర్రి, బ్రాహ్మణ కొట్కూరులలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని అక్రమ ఇసుక రవాణాపై 24 గంటల పాటు నిరంతరాయంగా ప్రత్యేక నిఘా ఉంచి నియంత్రణలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కొక్క నిఘా బృందంలో 13 మంది అధికారులు పనిచేస్తున్నారన్నారు. ఉచిత ఇసుక విధానంపై కమిటీ సభ్యులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయడంతో పాటు ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. స్టాక్ పాయింట్లు వద్ద వినియోగదారుడు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్లతో వెళ్లి ఇసుక త్రవ్వటానికి, లోడింగ్ కు ప్రతి మెట్రిక్ టన్నుకు రు. 335/- ప్రకారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి వినియోగదారునికి 20 మెట్రిక్ టన్నుల వరకు ఇసుక తీసుకోవచ్చన్నారు. డిజిఎం పోర్టల్ లో లాగిన్ అయితే స్టాక్ పాయింట్ లలో ఉన్న ఇసుక నిలువల వివరాలు తెలుస్తాయన్నారు.

జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ మాట్లాడుతూ చాగలమర్రి బ్రాహ్మణ కొట్టుకూరు కొలిమిగుండ్లలో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉచిత ఇసుక విధానంలో ప్రజల వద్ద నుండి ఫీడ్ వ్యాకులు తీసుకోవాలని సూచించారు.

జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రవాణాకు సంబంధించి అధిక సంఖ్యలో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించాలని రవాణా అధికారులను సూచించారు. ప్రభుత్వం నిర్ధారించిన రేటుకు మించి రవాణా చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మనోహర్ డిపిఓ మందుల వాణి గ్రౌండ్ వాటర్ డిడి రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!