గుండమ్మ కుమారుడు కిషోర్ కుమార్ ని పరామర్శించిన కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్

హత్యకు గురైన గుండమ్మ కుమారుడు కిశోర్ కుమార్ ని పరామర్శించిన కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్
ఆదోని ప్రతినిధి జులై 24 యువతరం న్యూస్:
హత్యకు గురైన గుండమ్మ కుమారుడు కిశోర్ కుమార్ ను బుధవారం జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ నాగనాథహళ్ళి గ్రామాన్ని సందర్శించి పరామర్శించారు.
ఈ సంధర్బంగా కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు.
కుటుంబానికి ప్రభుత్వం నుండి రావలసిన బెనిఫిట్స్ అన్నింటిని కలెక్టర్ తో మాట్లాడి త్వరితగతిన వచ్చేటట్లు చూస్తామన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించి , ఆత్మస్ధైర్యాన్ని నింపారు. నాగనాథహళ్ళి గ్రామంలో తగినంత భద్రతను కల్పిస్తామన్నారు.
జరిగిన విషయం.
ఆదోని మండలం, ఇస్వి పోలీసుస్టేషన్ పరిధిలోని నాగనాథహళ్లి గ్రామంలోని 4 ఎకరాల పొలాన్ని గుండమ్మ తిరుమలమ్మ, సోమ శేఖర్ రెడ్డి దంపతుల నుండి 2019 లో కోనుగోలు చేసింది.
ఈ నెల 12వ తేదీన ఆదోని మండలం, నాగనాదనహళ్లి గ్రామ పొలంలో రాఘ వేంద్రారెడ్డి, అతని కుమారుడు శ్రీధర్ రెడ్డి, మరో నలుగురు ఈ భూమి విషయంలో గుండమ్మతో వాగ్వాదానికి దిగారు.
2022 లో గుండమ్మ కుమారుడు కిషోర్ కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది.
ఈ పొలం విషయంలో గతంలో రాఘవేంద్రరెడ్డి , తిరుమలమ్మ మధ్య వివాదం ఉండడంతో ఆదోని సివిల్ కోర్టులో కేసు కొనసాగుతుంది.
ఈ భూమి కోనుగోలు చేసినప్పటి నుండి పొలాన్ని సాగు చేసుకుంటూ వస్తున్న గుండమ్మను జూలై 12 వ తేదిన రాఘవేంద్ర రెడ్డి అతని కుమారుడు శ్రీధర్ రెడ్డి, మరో నలుగురు కలిసి భూమి విషయంలో గుండమ్మతో వాగ్వాదానికి దిగారు.
శ్రీదర్ రెడ్డి గుండమ్మను ట్రాక్ట ర్ తో ఢీకొట్టి హత్య చేశారు.
ఆదోని పట్టణం శిరుగుప్ప మలుపు వద్ద జూలై 15 వ తేదిన
నిందితులైన 1) శ్రీధర్ రెడ్డి, 2) రాఘవేంద్ర రెడ్డి, 3) సోమశేఖ ర్ రెడ్డి 4) సుబ్బారెడ్డి, 5) రామకృష్ణ, 6) గోవిందరాజలను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు.
జిల్లా ఎస్పీ వెంట ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి, ట్రైనీ డీఎస్పీ ధీరజ్, స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజ్ యాదవ్, ఆదోని గ్రామీణ సీఐ నిరంజన్ రెడ్డి, ఇస్వీ, ఆదోని రూరల్ ఎస్సైలు శ్రీనివాసులు, ఎర్రి స్వామి , పోలీ సులు పాల్గొన్నారు.