
ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్య అందిస్తున్నాం
– పినపాక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శేషుబాబు
భద్రాద్రి ప్రతినిధి జూన్ 15 యువతరం న్యూస్:
ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలకు దీటుగా మెరుగైన విద్యను అందిస్తున్నామని పినపాక జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శేషుబాబు తెలియజేశారు. శుక్రవారం పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పినపాక జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల విషయమై మాట్లాడారు. పినపాక జూనియర్ కళాశాలలో తెలుగు మీడియం తో పాటు ఇంగ్లీష్ మీడియం సైతం అందుబాటులో ఉందని తెలిపారు. కళాశాలకు వచ్చే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందిస్తున్నట్లుగా తెలిపారు. దూరం నుంచి వచ్చే అబ్బాయిలకు హాస్టల్ సౌకర్యం ఉందని, అమ్మాయిలకు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందాలని విద్యార్థుల తల్లిదండ్రులకు అందించే సౌకర్యాలను, కళాశాలలో గల సౌకర్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు.