BREAKING NEWSCRIME NEWSSTATE NEWSTELANGANA
బిగ్ బ్రేకింగ్ న్యూస్: మందు పాతర పేలి రైతు మృతి

బిగ్ బ్రేకింగ్ న్యూస్
ములుగు జిల్లాలో పేలిన మందు పాతర
కట్టెల కోసం అని అడవికి వెళితే కడతేరిన రైతు జీవితం
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో ఘటన
వాజేడు ప్రతినిధి జూన్ 3 యువతరం న్యూస్:
మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఇల్లందుల ఫకీరు ఇల్లందుల రమేష్, ఇల్లెందుల పాల్గగుణ,ఇల్లందుల ఏసు అరికెల లక్ష్మయ్య ఐదుగురు ఈరోజు ఉదయం వంట చెరుకు కోసమని అడవికి కొంగాల గుట్టల పైకి వెళుతున్న సమయంలో పోలీసుల కోసం అని మావోయిస్టులు అమర్చిన మందు పాతర పై ఇల్లందుల ఏసు కాలు వేయడంతో ఒక్కసారిగా పేలిన మందు పాత్ర 40 అడుగుల మేర ఎగిరిపడ్డ వ్యక్తి ముక్కలుగా తెగిపడి సంఘటన స్థలంలోని మరణించినాడు. సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం వైద్యశాలకు తరలించారు.