ANDHRA PRADESHCRIME NEWS
ఇద్దరు వ్యక్తులకు 7 రోజులు జైలు శిక్ష

మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు ఏడు రోజులు జైలు శిక్ష
నంద్యాల ప్రతినిధి మే 29 యువతరం న్యూస్:
నంద్యాల పట్టణంలోని జగన్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ దగ్గర నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ వారి సిబ్బందిచే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ఉండి రోడ్డుపైన వాహనాలు నడుపుతూ పట్టు పడగా సదరు వ్యక్తులను విచారించి స్వాధీనంలోనికి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టు నందు చార్జి షీట్ దాఖలు చేసి, గౌరవ నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామభూపాల్ రెడ్డి ముందు హాజరుపరచగా సదరు గౌరవ జడ్జి గారు ముద్దాయిలకు ఒక్కొక్కరికి 07 జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.