మానసిక వికలాంగురాలుకు ఆర్థిక సహాయం, నూతన వస్త్రాలు అందజేసిన జల్లి సుజాత

నడిపూడి గ్రామంలో మానసిక వికలాంగురాలుకు ఆర్థిక సహాయం నూతన వస్త్రాలు జల్లి సుజాత ఆధ్వర్యంలో పంపిణీ
అమలాపురం ప్రతినిధి మే 25 యువతరం న్యూస్:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నడిపూడి గ్రామంలో వెంకటేశ్వరరావు కుమార్తె మానసిక వికలాంగురాలు జ్యోతికి అమలాపురం సాయి సంజీవిని మహిళా వాకర్స్ యోగా ఆరోగ్య సేవా సంస్థ అధ్యక్షురాలు, నంది పురస్కార గ్రహీత, సేవా శిరోమణి జల్లి సుజాత ఆధ్వర్యంలో నెల నెలా సేవా కార్యక్రమంలో భాగంగా ఆర్థిక సహాయము మరియు దుప్పట్లు ,చీరలు శనివారం ఉదయం అందజేశారు. ఈ సందర్భంగా జల్లి సుజాత మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో బాధల్లో ఉన్న వారిని పేదవారిని నేనున్నానంటూ ఆదుకోవాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని ఆమె అన్నారు. బాధల చీకట్లో ఉన్న వారికి సేవాభావంతో వెలిగివ్వడం ద్వారా దేవుడిచ్చినజీవితాన్ని సార్థకత చేసుకోవాలని మానవత్వంతో వాళ్ల కన్నీళ్లు తుడవాలని ఆమె అన్నారు.