ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి: టీజీ భరత్

ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి: టిజి భరత్
కర్నూలు ప్రతినిధి మే 11 యువతరం న్యూస్ :
ఎన్నికల ప్రచారములో భాగంగా కర్నూలు నందు ఈసిఎమ్ కాంపౌండ్ లో చివరి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి మేనిఫెస్టో లో మహిళలకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వరాల జల్లు ప్రకటించాడని, మహిళల సంక్షేమానికి టిడిపి పార్టీ కట్టుబడి ఉందని, ప్రతి మహిళ కు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంట్లో చదువుకొనే ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు అమ్మఒడి, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేయనున్నారని చెప్పారు. సైకల్ గుర్తుకు ఓటు వేస్తె అభివృద్ధికి ఓటు వేసినట్లేనని చెప్పారు. మహిళల ఆర్థికభివృద్ధి చంద్రబాబు లక్ష్యం అని చెప్పారు. నేను సేవ చేసే కుటుంబం నుంచి వచ్చిన నాకు నన్ను ఎమ్మెల్యే గా గెలిపించి మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పారు. మీకు ఇచ్చిన హామీలను ఐదేళ్లలో అమలుచేస్తానని చెప్పారు. మీ పవిత్రమైన ఓటు ను సైకిల్ గుర్తు పై వేసి గెలిపించాలని కోరారు.