ANDHRA PRADESHCRIME NEWSSTATE NEWS

కర్నూల్ లో భారీగా పట్టుబడిన నగదు, బంగారం, వెండి

భారీగా పట్టుబడిన బంగారము, వెండి, నగదు మొత్తం విలువ రూ. 4,కోట్ల59 లక్షలు

భారీగా బంగారం, వెండి తో పాటు నగదు స్వాధీనం చేసుకున్న వెల్దుర్తి సర్కిల్ పోలీసులు

సెట్ కాన్ఫరెన్స్ నందు స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజాను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ

(యువతరం ఫిబ్రవరి 3)
క్రిష్ణగిరి విలేఖరి:

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ గారి ఆదేశాల మేరకు గురువారం రాత్రి 11 గంటలకు క్రిష్ణగిరి మండలం, అమకతాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 పై ఉన్న టోల్ ప్లాజా వద్ద కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఖాజా సమాచారంతో హైదరాబాదు నుండి కోయంబత్తూరు వెళ్ళు ఎన్ ఎల్ 01 ఎం 2506 సురేష్ స్వామి అయ్యప్ప ప్రవేట్ స్లీపర్ ఏసి ట్రావెల్స్ బస్సు నందు 4 గురి వద్ద భారీగా బంగారం వెండి తో పాటు నగదు ను వెల్దుర్తి సర్కిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో…
స్వాధీనం చేసుకున్నవి.

నంద్యాల టౌన్ కు చెందిన అమర్ ప్రతాప్ పవర్ అతని వద్ద రూ.1 కోటి 20 లక్షల 80 వేల నగదు,

వెంకటేష్ రాహుల్ ఇతని వద్ద 3 కేజీల195 గ్రాముల బంగారు, రూ. 19 లక్షల 23 వేల 5 వందల నగదు,

సెంథిల్ కుమార్ ఇతని వద్ద రూ 44 లక్షల 50 వేల నగదు మరియు 1 కేజీ 37 గ్రాముల బంగారు,

శబరి రాజన్ ఇతని వద్ద 5 కేజీల వెండి బిస్కెట్లు కలవు.

పై వాటిని పంచాయతీ దారుల సమక్షంలో పంచనామా రాసి, వాటికి సరిపడా ఆధారాలు చూపుట కొరకు విజయవాడ ఆదాయపు పన్ను శాఖ వారికి లేఖ వ్రాయడమైనది.

మొత్తం పట్టుబడిన బంగారము, వెండి, నగదు మొత్తం విలువ రూ. 4 కోట్ల 59 లక్షల 8 వేల 3 వందలు.

ఏలాంటి పత్రాలు లేని
5 కేజీల వెండి,
4 కేజీల 232 గ్రాముల బంగారు,
ఒక కోటి 84 లక్షల 53 వేల,500 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగినది.

ఈ వాహన తనిఖీల్లో వెల్దుర్తి సీఐ సురేష్ కుమార్ రెడ్డి, వెల్దుర్తి ఎస్సై పి చంద్రశేఖర్ రెడ్డి, క్రిష్ణగిరి ఎస్సై ఎం చంద్రశేఖర్ రెడ్డి , వెల్దుర్తి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్, వెల్దుర్తి ఆర్ఐ మస్తాన్, కృష్ణగిరి విఆర్వో గిడ్డయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!