ANDHRA PRADESHPOLITICS

స్థిరమైన అభివృద్ధికి చిరునామా మాడుగుల

స్థిరమైన అభివృద్ధికి చిరునామా మాడుగుల

డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

రూ.10.30 కోట్ల రూపాయలతో 8 గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం

రూ15.50 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన

(యువతరం జనవరి 06)
దేవరాపల్లి విలేఖరి:

భవిష్యత్తు తరాల వారి స్వంత అవసరాలను తీర్చుకునే సామర్థ్యానికి రాజీ పడకుండా, ప్రస్తుత అవసరాలను తీర్చే విధంగా అభివృద్ధి పనులను చేపట్టామని వాటిని ప్రారంభించిన డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు అన్నారు. వడ్డాది – పాడేరు, ఆర్ అండ్ బి రోడ్డు పెట్రోల్ బంక్ నుండి తర్రా లక్ష్మీనారాయణ వారి కల్లాల వరకు వీరవల్లి, పోతనపూడి అగ్రహారం మీదుగా రూ.1.90 లక్షల రూపాయలతో నిర్మించిన తారు రోడ్డును మంత్రి ప్రారంభించారు.
అభివృద్దికి నిదర్శనంగా
రూ.35 లక్షల రూపాయలతో గణేష్ కాలనీలో నిర్మించిన డ్రైనేజీలు, రూ.1.8 కోట్లతో హై స్కూల్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు డ్రైనేజీలను, పోతనపూడి గ్రామంలో రూ.68 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం, ఆర్బికే భవనాలను, రూ1.90 కోట్ల రూపాయలతో వీరవల్లి పోతనపూడి మీదుగా బంగారు మెట్టుకు పక్కా రోడ్డును, రూ.10 లక్షలతో ఎమ్ .కోడూరులో ఆయుష్ ఆసుపత్రి సంబంధించిన నాడు నేడు అభివృద్ధి పనులు, రూ.2.55 కోట్లతో ఎల్బీ పట్నం నుండి కేఎల్బి పట్నం కేఎల్బీ పట్నం నుండి మాడుగుల వరకు రోడ్డు రూ. 70 లక్షలతో మాడుగుల పట్టణంలో దేవి ఆలయం నుంచి మోదమాంబ కాలనీ వరకు సిసి రోడ్డు డ్రైనేజీ ప్రారంభోత్సవం చేశారు. రూ.5 లక్షలతో ఎం. కోడూరు లో పశువైద్య శాల భవనాన్ని ప్రారంభించారు.
అతిధి దేవోభవ
అత్యంత సుందరంగా రూ.1.40 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రారంభించారు.
కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించిన ఎంపీ సత్యవతి
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉద్యానవన శాఖ సౌజన్యంలో శ్రీ మోదమంబా గొర్రెలు మేకలు రైతుల ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్ పి ఒ) రూ.1.40 కోట్లతో ఏర్పాటు చేసిన పంటల సేకరణ కేంద్రము-శీతాల గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ కేంద్రాన్ని ఎంపి భీశెట్టి సత్యవతి ప్రారంభించారు.
రూ.15.50 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన
మాడుగుల నుండి డి.గొటివాడ వెళ్ళే రోడ్డుకు రూ.6.50 కోట్లతో నూ, ఘాట్ రోడ్డు జంక్షన్ లో రూ.9 కోట్లతో కింతలి రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
అమ్మవారి సన్నిధిలో
ఎం.కోడూరులోని శ్రీ శ్రీ శ్రీ మోదమంబ అమ్మవారి గాలిగోపురం కలశ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయకమిటి వారు మంత్రిని ఘనంగా సన్మానించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారం
మాడుగులలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సేనాపతి కొండలరావు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఎంపీ సత్యవతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమణమ్మ, ఎంపీపీ రమధర్మాజ, జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనురాధ, మండల పార్టీ అధ్యక్ష్యులు రాజారామ్ పలువురు ప్రజాప్రతినిధులు, మండల గ్రామ స్థాయి అధికారులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!