POLITICSSTATE NEWSTELANGANA
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
(యువతరం జనవరి 4) మర్పల్లి విలేఖరి:
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా 98 కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఆర్డీవో, ఎమ్మార్వో, ఎంపీడీవో ,ఏపీవో, గ్రామ సెక్రెటరీ, గ్రామ సర్పంచ్, జెడ్పిటిసి, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సమక్షంలో గురువారం అందజేశారు. 24 టేబుల్ లలో 6 గ్యారంటీల ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే స్పీకర్ మాట్లాడుతూ జనాలకు నా జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. పెద్దలు జీ సుభాష్ యాదవ్, కొండల్ రెడ్డి, బ్లాక్ టు కృష్ణారెడ్డి, రామేశ్వర్, సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.