ANDHRA PRADESHDEVOTIONALWORLD

జనవరి 1 నుండి ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలు పంపిణీ

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర

(యువతరం డిసెంబర్ 31) కర్నూలు ప్రతినిధి

జనవరి 1 తేదీ నుండి ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం

జనవరి 1 తేదీ నుండి 15 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల కుటుంబాలకు అయోధ్య పూజిత అక్షింతల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అయోధ్య పూజిత అక్షింతలను, చిత్రపటాన్ని, కరపత్రాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకొని అయోధ్య శ్రీ రామచంద్రుడు ఆహ్వానాన్ని స్వీకరించి జనవరి 22 వ తేదీన అయోధ్య దీపావళిని ప్రతి ఒక్కరూ వైభవంగా నిర్వహించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయి రెడ్డి తెలిపారు. కర్నూలులో వినాయక ఘాట్ సమావేశ ప్రాంగణంలో లో జరిగిన మీడియా సమావేశంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే కర్నూలు జిల్లాలో అన్ని దేవాలయాల కేంద్రాలకు, అన్ని గ్రామాలకు అయోధ్య పూజితఅక్షింతలను, ఆహ్వాన పత్రము చిత్రపటాలను విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కార్యకర్తలు మరియు హిందూ ధార్మిక సంఘాల సమన్వయంతో పంపించడం జరిగిందని, జన సంపర్క్ అభయాన్ రాష్ట్ర కన్వీనర్ గూడా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జనవరి 1 వ తేదీ నుండి 5 వ తేదీ లోపు ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలను పంపిణీ చేసి అయోధ్యలో జనవరి 22వ తేదీ నాడు జరిగే బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రతి దేవాలయం కేంద్రంగా శ్రీరామ నామ జప భజనలు, సంకీర్తనలు, సత్సంగాలు, హోమాలు నిర్వహించి ఎల్ఈడి స్క్రీన్ లలో అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని అనంతరం అన్న ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని పండుగ వాతావరణములో ఉత్సవాలు జరుపుకోవాలని తెలియజేశారు. అలాగే జనవరి 22 వ తేదీ సాయంత్రం ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి, ప్రతి దేవాలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అలంకరించి దేవాలయ కేంద్రంగా గ్రామాలలో, నగరాలలో , పట్టణాలలోని బస్తీలలో శోభాయాత్రలు నిర్వహించి ‘ అయోధ్య దీపావళి”ని జరుపుకోవాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది. బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ టి.ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 500 సంవత్సరాల ఉద్యమ పోరాట ఫలితమే అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం అని, అయోధ్య ఉద్యమ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో విశ్వహిందూ పరిషత్ కర్నూల్ నగర అధ్యక్షులు టి.సి.మద్దిలేటి మాట్లాడుతూ కర్నూలు నగరంలో అన్ని దేవాలయాల కేంద్రంగా అయోధ్య పూజిత అక్షింతల కార్యక్రమాన్ని విజయవంతంగా రేపటినుండి ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, ధర్మ ప్రచార రాష్ట్ర కన్వీనర్ అనంత విశ్వప్రసాద్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు గురుమూర్తి, మాలిగి భాను ప్రకాష్,గోవిందరాజులు, ఈపూరి నాగరాజులు, నీలి నరసింహ, వడ్ల భూపాల చారి, వడ్డే రాము, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!