
సంగమేశ్వర దర్శనం.. పాపహరణం
తొలిపూజ అందుకున్న సంగమేశ్వరుడు
(యువతరం డిసెంబర్ 3) కొత్తపల్లి విలేకరి :
కొత్తపల్లి సప్తనదుల్లో స్నానం ఆచరించి సంగమేశ్వరున్ని దర్శనం చేసుకుంటే పాపలనుంచి విముక్తి కలిగి మోక్షం లభించి నరకలోక ప్రవేశం తప్పుందని భక్తుల నమ్మకం అందువల్లే ఈ ఆలయం ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే దర్శన భాగ్యం ఉండటంతో సందర్శన కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. జూలై మూడవ వారంలో కృష్ణమ్మ పరువళ్లతో ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కరువకపోవడంత “ శ్రీశైల జలాశయనీటిమట్టం త్వరగా తగ్గడంతో 4 నెలలకే పూర్తిస్థాయిలో ఆలయం దర్శనం లభించింది. ధర్మరాజు ప్రతిష్టింపబడిన వేపదారుని లింగం దర్శనమిచ్చింది. పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణంలో ఉన్న బుడదను శుభ్రపరిచి శనివారం రాత్రి శ్రీలలితా సంగమేశ్వర స్వామి, వినాయకుడు, తదితర దేవతమూర్తులు తొలిపూజ అందుకున్నారు సంగమేశ్వరం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయించినస్థలం.
ప్రపంచంలోనే ఎడునదులు కలిసే ఏకైక ప్రదేశం:*సంగమేశ్వరం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండంలంలోని సంగమేశ్వరంలో తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భనవాసి అనే ఏడు నదులు కలిసే అద్భుతమైన ప్రదేశం. పురాణాల ప్రకారం ప్రజల పాప ప్రక్షాళన చేస్తూ పాపులను పునీతులుగా మారుస్తున్న గాంగ నదికి కాకి రూపం వచ్చిందని ఆ రూపం పోగొట్టుకోవటానికి సమస్త తీర్థాలతో జలకమాడుతూ తిరుగుతూ సంగమంలో స్నానం చేసి హంస రూపం పొందిందని కథనం. పాప నివృత్తి అయినందున ఈ ప్రదేశానికి నివృత్తి సంగమేశ్వరం అని పేరు.
*కొన్ని నెలలే పూజలు:*
ఆలయ సముదాయం ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు సుమారు ఇరవై వేల చదరపుఅడుగుల విస్తీర్ణంలో ఆలయంతోపాటు, చుట్టూ ప్రకారం నిర్మించినట్లు శిధిలాలను చూస్తుంటే అర్ధమౌతుంది. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది ముఖమండపం పూర్తిగా శిధిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నారు. శివుడు వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిలో ఈ ఆలయం మునిగి పోవటం వల్ల నిత్యపూజలు జరుగవు. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే పూజలు జరుగేవి. ఈ ఏడాది త్వరగా శ్రీశైల జలాశయ నీటిమట్టం తగ్గటంతో సంగమేశ్వరుడు జలాధివాసం నుంచి బయటపడటంతో దర్శన భాగం త్వరగా లభించింది ఈ ఏడాది 8 నెలలపాటు సంగమేశ్వరుని దర్శనభాగ్యం లభించే అవకాశముంది.