అడ్డు వచ్చిన కాంగ్రెస్ మహిళ పై అసభ్య దూషణ

అడ్డువచ్చిన కాంగ్రెస్ మహిళ పై పచ్చి బూతులు
మహిళను కొట్టేందుకు చెప్పు తీసిన ఘనుడు
బయ్యారం పోలింగ్ బూత్ వద్ద ఘటన
రంగంలోకి దిగిన పోలీసులు లాటి చార్జ్
నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అని కార్డ్ చూపించుకున్న రేగా కాంతారావు
అమాయకుల మీద కక్షతో కేసులు పెట్టించే ప్రయత్నం
ఇది ఎంతవరకు సబబు..?
పినపాక కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గోడిశాల రామనాథం
(యువతరం నవంబర్ 30) భద్రాద్రి ప్రతినిధి:
పినపాక నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గురువారం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు నియోజవర్గంలో పర్యటించారు. అందులో భాగంగానే పినపాక మండలం ఈ బయ్యారం చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద జై బిఆర్ఎస్ జై రేగా కాంతారావు అంటూ కేకలు వేస్తూ పోలింగ్ కేంద్రాల వద్దకు వెళుతున్న రేగా కాంతారావును కాంగ్రెస్ మహిళ ప్రశ్నించింది. ఎందుకు? అల్లర్లు సృష్టిస్తున్నారంటూ నిలదీసింది. జీర్ణించుకోలేని రేగా కాంతారావు మహిళపై దుర్భాషలాడుతూ కొట్టేందుకు తన కాలుకు ఉన్న షూ తీసిన ఘటన పినపాక నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది.
ఇలాంటి అభ్యర్థిని ఎందుకు పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి అంటూ మహిళలు ఆందోళనకు దిగినారు. ఇలాంటి దుర్మార్గులు మన నియోజకవర్గానికి అవసరమా అంటూ మహిళలు తిట్టి పోస్తున్నారు. ఆ క్రమంలోనే రంగ ప్రవేశం చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు వివాదాలకు దిగగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు లాఠీచార్జి చేశారు. లాటించార్జి చూసిన ఇరువర్గాల నాయకులు పరుగులు పెట్టారు. లాటి చార్జి క్రమంలోనే పోలీసులు రేగా కాంతారావు పైకి వెళ్ళగా ఆగు ఆగు నేను రేగ కాంతారావునీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని కొట్టకండి ఇదిగో నా కార్డు అంటూ చూపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పినపాక నియోజకవర్గం లో ఎన్ని రోజులు తన అనుచర గణం అరాచకాలే బయటపడ్డ తరుణంలో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సమయంలో రేగ కాంతారావు విశ్వరూపం బయటపడింది అంటూ పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి అభ్యర్థి మరోసారి గెలిస్తే నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రజా ప్రతినిధి వీధి రౌడీలా ప్రవర్తించడం ఎంతవరకు సబబు..?
– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం బయ్యారంలో జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలతో వీధి రౌడీల్లా ప్రవర్తించడం ఎంతవరకు సబబు అని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామనాథం అన్నారు. ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంగ్రెస్ కార్యకర్తలపై మండిపడి కొట్లాటకు దిగడం ఎంతవరకు న్యాయమని పైగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ఆయనకే తెలియాలని రామనాథం అన్నారు. మహిళలు వారిపై అలా ప్రవర్తించడం న్యాయం కాదని అన్నారు.