నంద్యాలలో కోటి పది లక్షల వ్యయంతో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ

కోటి పది లక్షల వ్యయంతో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ప్రారంభించిన… జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ
(యువతరం నవంబర్ 17)నంద్యాల ప్రతినిధి:
నంద్యాల పట్టణంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణంలో నూతనంగా ఒక కోటి పది లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యాలయం కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయడం జరిగిందని, నంద్యాల మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన నీటి సమస్య ఈ కార్యాలయ నిర్వహణ ద్వారా పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నంద్యాల మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజల తాగునీటి అవసరాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఈ RWS కార్యాలయం శిథిలావస్థకు చేరిన పరిస్థితిని గమనించి, కార్యాలయాన్ని రూ. 1 కోటి 10లక్షల రూపాయల వ్యయంతో రూపొందించడం జరిగిందన్నారు. నంద్యాల మండల పరిధిలోని గ్రామాలకు అత్యంత ప్రధాన అవసరాలు తీర్చే ఈ కార్యాలయం ప్రజలకు, సంభందిత అధికారులకు అందుబాటులో ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామాన్ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, నంద్యాల మండలం ఎంపీపీ శెట్టి ప్రభాకర్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావళి, కౌన్సిలర్స్ కలాం భాష, వైసిపి నాయకులు అనిల్ అమృతరాజ్ సోమశేఖర్ రెడ్డి, పార్ధుడు ,నాగరాజు, అప్పన్న గౌడ్, రాజా జలీల్, మరియు అధికారులు పాల్గొన్నారు