ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీ మహా గౌరీ దేవి అలంకరణలో శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు

శ్రీ మహా గౌరీ దేవి అలంకరణలో శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు
(యువతరం అక్టోబర్ 22) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రం నందు దసర మహోత్సవాలలో 8వ రోజు అమ్మవారి అలంకరణ రూపం శ్రీమహా గౌరీదేవి, శ్రీమహా గౌరీ రూపం అత్యంత శాంతమూర్తిగా చెప్పబడింది. తెల్లని వృషభాన్ని వాహనంగా గల ఈ దేవి తెల్లని వస్త్రాన్ని ధరించినదై కుడివైపు చేతిలో త్రిశూలాన్ని క్రింది చేతిలో అభయహస్తాన్ని ఎడమ చేతిలో వరద ముద్రను ,క్రింది చేతిలో డమరుకం ఉంటుంది. ఈ దేవుని పూజించడం వలన పాపాలని నశించి కష్టాలు తొలగిపోతాయి. ఆదిపరాశక్తి నవదుర్గ రూపాలలో 8వ శక్తి రూపంగా మహా గౌరీ చెప్పబడింది. స్వామి అమ్మవార్ల ఊరేగింపు నంది వాహనంపై పూరమాడవీధులలో ఊరేగింపు జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.