ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSSTATE NEWS
యాడికి మండలంలో మూడు హత్యలు

యాడికి మండలం నిట్టూరులో త్రిబుల్ మర్డర్
(యువతరం సెప్టెంబర్ 16) అనంతపురం బ్యూరో
యాడికి మండలం నిట్టూరు గ్రామం నందు మతిస్థిమితం సరిగా లేని ప్రసాద్ అనే వ్యక్తి నిద్రపోతున్న బాలరాజు, సోమక్క అనే భార్యాభర్తలను అకారణంగా కొట్టి చంపినట్లు సమాచారం. అది చూసిన చుట్టుపక్కల వారు అందరూ మతిస్థిమితం లేని ప్రసాద్ ను కూడా కొట్టి చంపినట్లు తెలిసింది. ఇది రాత్రి సుమారు రెండు గంటల సమయంలో జరిగినది అందరూ రజక కులస్తులే. ప్రసాదు వీరికి బంధువు అవుతాడు. హత్యలకు గల కారణాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది.