ANDHRA PRADESHPOLITICSSTATE NEWS
చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేయడం సరికాదు

చంద్రబాబు పై కేసులు నమోదు చేయడం సరికాదు
టిడిపి మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు
మండల ఉపాధ్యక్షుడు వెంకట రాముడు చౌదరి
(యువతరం సెప్టెంబర్ 12) తుగ్గలి విలేఖరి:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం సరికాదని టిడిపి మండల అధ్యక్షుడు తిరుమల నాయుడు టిడిపి మండల ఉపాధ్యక్షులు వెంకటరాముడు చౌదరి అన్నారు .మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ యువ గళం పాదయాత్ర లో తెలుగుదేశం పార్టీకి ప్రజాధరణ పెరుగుతుండడంతో వైసిపి నాయకులు ఓర్వలేక అక్రమ కేసులు పోలీసులు చేత పెట్టించడం జరిగిందన్నారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు తెలుగుదేశం పార్టీలో చోటు లేదని వారు అన్నారు. జాతీయ స్థాయిలో మచ్చలేని నాయకుడిగా నారా చంద్రబాబునాయుడు ఉన్నారని వారు తెలిపారు. అందువల్ల ఆయన పై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని వారు డిమాండ్ చేశారు.