ANDHRA PRADESHOFFICIALPOLITICS
పోలీసుల కళ్ళు కప్పి బందులో పాల్గొన్న డోన్ నియోజకవర్గ తెదేపా ఇంచార్జి ధర్మారం సుబ్బారెడ్డి

గృహ నిర్బంధం ఛేదించి బంద్ లో పాల్గొన్న డోన్ టీడీపీ ఇంచార్జ్ ధర్మారం సుబ్బారెడ్డి
(యువతరం సెప్టెంబర్ 11) డోన్ ప్రతినిధి:
తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అక్రమ కేసులు బనాయించారంటూ తెలుగుదేశం నాయకులు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో డోన్ నియోజకవర్గ తెదేపా ఇన్చార్జి ధర్మారం సుబ్బారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గృహనిర్బంధాన్నించి చేదించి డోన్ ఆర్టీసీ డిపో ఎదుట టీడీపీ శ్రేణులతో కలిసి ధర్మారం సుబ్బారెడ్డి బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు వెంటనే ధర్మారం సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ నుండి రాచర్ల పోలీస్ స్టేషన్ కు. పోలీసులు తరలించడం జరిగింది.