ANDHRA PRADESHPOLITICSSTATE NEWS
పొదలాడ యువ గళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత
క్యాంప్ సైట్ వద్ద నిరసన తెలుపుతున్న నారా లోకేష్

పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత.
(యువతరం సెప్టెంబర్ 9) ఉమ్మడి తూర్పుగోదావరి:
చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు.
ఎలాంటి నోటీసులు లేకుండా గంట నుండి పోలీసుల హై డ్రామా.
నోటీసులు అడిగితే డిఎస్పీ వస్తున్నారు అని చెబుతున్న పోలీసులు.
లోకేష్ వద్దకు మీడియా కూడా రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు.
నా తండ్రిని చూడడానికి నేను వెళ్ళకూడదా అని పోలీసులను నీలదీసిన లోకేష్.
నా వెంట నాయకులు ఎవరు రావడం లేదు… కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నా అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ నిలదీసిన లోకేష్.
చంద్రబాబు అరెస్ట్ కి నిరసన గా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముందే బైఠాయించి నిరసన తెలుపుతున్న లోకేష్