
మానవత్వం చాటుకున్న పినపాక నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పాల్వంచ దుర్గ …!
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా
గోదావరి వరదల వల్ల ఇల్లు కూలిపోయిన బాధితులు కూ నిరుపేదలు కూ 25 కేజీల బియ్యం అందజేశారు..
(యువతరం సెప్టెంబర్ 2 ) భద్రాద్రి ప్రతినిధి.
సమాజం లో అభగ్యులకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపం లో ఆసరా అవ్వాలని పినపాక నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పాల్వంచ దుర్గ అన్నారు. శనివారం, మణుగూరు , మండలం లోని సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మణ్, వర్షం వల్ల ఇల్లు కూలిపోయిన కుంటుంబానికి మరియు మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో చెరువు గట్టు మీద నివసించే నిరుపేద కుటుంబానికి,అందజేశారు పినపాక మండలం లోని గోపాలరావు పేట లో ముగ్గురు ఆడపిల్లలు ఒంటరి మహిళా కుంటుంబానికి మరియు వృద్ద దంపతులు కూ,కరకగూడెం మండల పరిధిలో గల మోతె గ్రామానికి చెందిన జలగం రామదాసు కుటుంబానికి, వర్షాల వలన వరదలకు గురైన కరకగూడెం గ్రామానికీ చెందిన మన్నెం మంగమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించి, అనారోగ్యానికి గురి అయినటువంటి షేక్ మొహమ్మద్ ని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని 25 కేజీల బియ్యం, ప్రతి కుటుంబానికి 25 కేజీల చొప్పున పాల్వంచ దుర్గ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఎల్లపుడు పేద ప్రజలకు సహాయం చేయడమే పాల్వంచ దుర్గ ముఖ్య ఉద్దేశ్యం అని సామజిక కార్యకర్త లాయర్ కర్నె రవి తెలిపారు.
ఈ కార్యక్రమం లో పినపాక సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్ పత్రిక విలేఖర్లు, కన్నె రమేష్ ,గొడిశాల చంద్రం, కొంపెల్లి మల్లేష్, గాడుదుల దిలీప్, రేసు కోటేష్,రాకేష్, జమిల్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.