గిరిజనుల అభివృద్ధికి జగనన్న కృషి

గిరిజనుల అభివృద్ధికి జగనన్న కృషి
ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
(యువతరం సెప్టెంబర్ 2) తుగ్గలి విలేఖరి:
రాష్ట్రంలోనే గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవమ్మా అన్నారు. శనివారం బాటతాండాలోనే వైఎస్ఆర్సిపి నాయకుడు రత్న నాయక్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవిమ్మా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలనుండి అటవీ భూములు సాగు చేస్తున్న గిరిజనులకు ఆ భూములపై సంపూర్ణ హక్కు కలిగే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే మండలంలోని అన్ని గిరిజన తండాలో మంచినీటి సమస్య పరిష్కరిస్తూ, సిసి రోడ్లు వేయడం జరిగిందన్నారు. అలాగే విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కొత్తగా కరెంట్ లైను వేయించాను అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ప్రభాకర్ రెడ్డి, బాలమ్మ ,వైసీపీ నాయకులు రామచంద్రారెడ్డి, రాతనమోహన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి ,తుగ్గలి మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ,సురేంద్రనాథ్ రెడ్డి ,జిట్టా నగేష్ యాదవ్, బొల్లవానిపల్లి శేఖర్ రెడ్డి, బోడబండ హనుమంతు తదితరులు పాల్గొన్నారు .