మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ 14వ వర్ధంతి వేడుకలు

మాజి ముఖ్యమంత్రి వైయస్సార్ 14వ వర్ధంతి వేడుకలు.
(యువతరం సెప్టెంబర్ 2) పెద్ద దోర్నాల విలేఖరి:
మండలంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా మండల కన్వీనర్ ఘంటా వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన దోర్నాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు.
కార్యక్రమంలో గ్రామ మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు పేద బిడ్డల చదువులకు పెన్నిధి,ముస్లింల శ్రేయభిలాషి వైయస్సార్.
రైతులకు అవసరమైన సాగు నీరు అందిస్తే వాళ్లు ఎవరి మీద ఆధారపడరు అని
2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేసిన ఘనత వైయస్సార్.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ ఆయన సీఎం అయిన తర్వాత పేదలకు కూడు, గూడు,విద్య,వైద్యం, ఉచితంగా అందించాలన్ని చిరకాల కోరికను నెరవేర్చారు. సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలు వృద్ధులు, వితంతువులు, చేనేతలు, వికలాంగులకు పింఛన్లు వైయస్ పాలనలోనే మొదలైంది.
పేద ప్రజలకు అత్యంత అవసరమైన పావలా వడ్డీ,అభయ హస్తం,జలయజ్ఞం, రైతుల పంట రుణాల మాఫీ,భూ పంపిణీ, పశు క్రాంతి, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశారని మాట్లాడారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని,108 అత్యవసర అంబులెన్స్ సర్వీసు లు వైయస్సార్ ప్రారంభించారు.
అనంతరం దోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన నాయకులు.
ఈ కార్యక్రమంలో ఘంటా వెంకటరమణారెడ్డి, గ్రామ మేజర్ పంచాయతీ చిత్తూరి హారిక, ఎంపీపీ గుమ్మ పద్మజ, ఉప సర్పంచ్ దూదేకుల రసూల్, చంద్రకాంత్ నాయక్, మాజీ సర్పంచ్ యక్కంటి లింగారెడ్డి, యక్కంటి వెంకటేశ్వర రెడ్డి, గుమ్మ ఎల్లేష్,గుండారెడ్డి రమణారెడ్డి, అల్లు రాంభూపాల్ రెడ్డి, అల్లు ఆంజనేయ రెడ్డి, ఒంటేరు రమణయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.