ఘనంగా వైయస్సార్ 14వ వర్ధంతి వేడుకలు

ఘనంగా వైయస్సార్ 14వ వర్ధంతి వేడుకలు
రైతు బాంధవుడు వైయస్సార్
(యువతరం సెప్టెంబర్ 2) అమడగూరు విలేఖరి:
మండల కేంద్రంలోనివివిధ గ్రామాలలో వైయస్సార్ 14 వ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత మండల కేంద్రంలోని మహానే త వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మండలంలోని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మండల కేంద్రానికి భారీగా చెరుకుని వైయస్సార్ వర్ధంతి వేడుకలకు హాజరయ్యారు. మహానేతకు గట్టిగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని రైతు బాంధవుడుగా చరిత్రలో నిలిచారని వారు కొనియాడారు. ప్రతి రైతు కళ్ళలో ఆనందం చూడాలని ఉద్దేశంతో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి జల ప్రదాతగా నిలిచారన్నారు. రైతు సంక్షేమానికి విశేషంగా కృషి చేసి రైతుల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. తండ్రి బాటలోనే తనయుడు సంక్షేమ పథకాల సృష్టికర్త, జననేత జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అమడగూరు సర్పంచు షబ్బీర్ భాష,టౌన్ కన్వీనర్ సుధాకర్ రాజు ,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.