ANDHRA PRADESHPOLITICS
ఎల్ నగరంలో వైసీపీ మద్దతుదారుడు విజయం

ఎల్ నగరంలో వైసీపీ మద్దతుదారుడు విజయం
(యువతరం ఆగస్టు 20) వెల్దుర్తి విలేఖరి:
వెల్దుర్తి మండలంలోని ఎల్ నగరం గ్రామంలో వార్డు మెంబర్ కు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 197 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీ మద్దతు దారుడు నక్క లోకేష్ కు 150 ఓట్లు వచ్చాయి. తెదేపా మధుదారుడు శీను నాయక్ కు 42 ఓట్లు వచ్చాయి. ఇన్వాలిడ్ 4 ఓట్లు వచ్చాయి. నోటాకు 1 ఓటు వచ్చింది. 108 ఓట్ల మెజార్టీతో వైసిపి మద్దతుదారుడు నక్క లోకేష్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి అక్బర్ బాషా తెలిపారు. విజయం సాధించిన నక్క లోకేష్ కు ఎన్నికల అధికారి అక్బర్ బాషా డిక్లరేషన్ ఫారం అందజేశారు. నక్క లోకేష్ విజయం పట్ల మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.