మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మైనార్టీల అభివృద్ధి కి వైకాపా ప్రభుత్వం కృషి
వక్ఫ్ బోర్డ్ జిల్లా చైర్మన్ నియాజ్ అహ్మద్
తుగ్గలి యువతరం విలేఖరి;
రాష్ట్రంలోనే మైనార్టీల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వక్ బోర్డ్ జిల్లా చైర్మన్ నియాజ్ అహ్మద్, డైరెక్టర్ టిఎండి హుసేని లు అన్నారు. బుధవారం రాతన గ్రామంలోనే మసీదును వారు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లింల విన్నపం మేరకు ఈద్గాకు ప్రహరీ గోడ నిర్మించేందుకు రూ 36 లక్షలతో, అలాగే మసీదుకు మరమ్మతుల కోసం రూ 5 లక్షలతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని వారు తెలిపారు. అనంతరం ముస్లింలు అభివృద్ధి కోసం వైకాపా ప్రభుత్వం చేస్తున్న వివిధ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వారు వివరించారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైయస్సార్ కె దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు ఆర్ వి .మోహన్ రెడ్డి, సర్పంచ్ రాచప్ప, మండల కో ఆప్షన్ సభ్యులు చాంద్ బాషా, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ రహిమాన్, స్థానిక మైనార్టీ నాయకుడు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.