ANDHRA PRADESHPROBLEMSSOCIAL SERVICESTATE NEWS

దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి

దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
డి హెచ్ పి ఎస్

కోసిగి యువతరం విలేఖరి:

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డి హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి.మహేష్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
స్థానిక సిపిఐ కార్యాలయంలో డి హెచ్ పి ఎస్ మండల సమితి సమావేశం ఓంకార స్వామి అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డి హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి.మహేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, సిపిఐ మండల కార్యదర్శి ఎం. గోపాల్ హాజరయ్యారు.
సమావేశం ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయాయని వాటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని వారన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం దళితులకు రాజ్యాంగంలో ఏవైతే హక్కులున్నాయో వాటిని పూర్తిగా నీరుగారిచే ప్రయత్నం చేస్తుందని వారన్నారు. రాష్ట్రంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి సుమారుగా 27 దళితులకు సంబందించిన సంక్షేమ పథకాలను రద్దు చేసిందని వారు అన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం కార్పొరేషన్ పేరుతో బడ్జెట్లో సుమారుగా 17 వేల కోట్లు విడుదల చేస్తుందని అయితే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఎస్సి కార్పొరేషన్ ఇవ్వలేదని వారు తెలిపారు.
అయితే బడ్జెట్లో విడుదల చేసినటువంటి 17 వేల కోట్లు ఎక్కడ మళ్లించారో చెప్పాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులను కేవలం ఓటు బ్యాంకింగ్ గా వినియోగించుకుంటున్నారే తప్ప వారి అభివృద్ధికి నోచుకోవడం లేదని వారన్నారు. ఇప్పటికైనా దళితుల సమస్యలు పరిష్కరించాలని, వారిపై జరుగుతున్న దాడులు అరికట్టాలని వారు కోరారు. లేనిపక్షంలో డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఎం.రాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరేష్, డి హెచ్ పి ఎస్ నాయకులు ఈరాన్న, నల్లన్న, కృష్ణ, తిక్కయ్య, రాజు, బాబు, వెంకన్న, నర్సప్ప, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం డిహెచ్పిఎస్ నూతన కమిటీ ఎన్నిక చేశారు.
మండల అధ్యక్షలుగా బి. తిక్కయ్య
మండల ప్రధాన కార్యదర్శిగా జుమ్మలదిన్నె రాజు
మండల ఉపాధ్యక్షులుగా కృష్ణ, నల్లన్న, వీరెష్
మండల సహాయ కార్యదర్శులుగా బాబు, రాజు, ఈరాన్న, ఓంకార స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!