
తానా సభలకు అమెరికా వెళ్లిన నందమూరి బాలకృష్ణకు ఘనస్వాగతం
మన్నవ మోహన కృష్ణ
యువతరం డెస్క్;
ఈనెల 7,8,9 తేదీలలో న్యూయార్క్‌లో నిర్వహించే తానా సభలలో పాల్గొనేందుకు హిందూపూర్ శాసనసభ్యులు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అమెరికా వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, నాట్స్ మాజీ ప్రెసిడెంట్ మన్నవ మోహన్ కృష్ణ, తానా కాన్ఫరెన్స్ అడ్వైజర్ జానీ నిమ్మలపూడి, సతీష్ మేక స్వాగతం పలికారు.
నందమూరి బాలకృష్ణకు న్యూయార్క్ విమానాశ్రయంలో మోహన కృష్ణ పుష్ప గుచ్చం అందజేసి ఆహ్వానం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా నందమూరి బాలకృష్ణను తీసుకొని వెళ్లడం జరిగింది.