
51 వ రక్తదానం చేయడం అభినందనీయం
ఐవిఎఫ్ సేవాదళ్
కామారెడ్డి యువతరం ప్రతినిధి;
జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన హజీర బేగం కాలు ఆపరేషన్ నిమిత్తమై ప్రైవేటు వైద్యశాలలో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును బుధవారం సంప్రదించారు. కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ 51 వ సారి కామారెడ్డి బ్లేడ్ సెంటర్ కెబిఎస్ లో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు.
51వసారి రక్తదానం చేయడం అభినందనీయమని,కిరణ్ నేటి యువతకు సమాజానికి స్ఫూర్తిగా నిలిచాడని రక్తదానం చేసినందుకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు జీవన్,సంతోష్ వెంకట్ లు పాల్గొనడం జరిగింది.