నూతన విద్యార్థులకు పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి
ఆందోళనలో విద్యార్థులు

నూతన విద్యార్థులకు పాత సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి
భద్రాద్రి కొత్తగూడెం, యువతరం ప్రతినిధి.
నూతన విద్యా సంవత్సరం లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థలలో పాత సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ అన్నారు. మణుగూరు పట్టణంలో బుధవారం పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ముద్రించిన నూతన విద్యార్థులకు విప్లవ స్వాగతం తెలుపుతూ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెలిపారు. ఉన్న విద్యా సంస్థలలో మౌలిక సౌకర్యాలు కల్పించకుండా అధ్యాపకులను నియమించకుండా నూతన గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులను గురుకులాలకు తరలించినప్పటికీ అక్కడ కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని దీనితో ప్రాథమిక విద్యాసంస్థలలో,జూనియర్ కళాశాలలో విద్యార్థులు లేక వెలవెలలాడుతున్నాయని తెలిపారు. దీని వెనక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని కులాల పేరుతో మతాల పేరుతో గురుకులాలను ఏర్పాటు చేసి విద్యావ్యవస్థను గందరగోళం చేస్తూ ఉన్న విద్యా సంస్థలను అభివృద్ధి చేయకుండా కొత్త గురుకులాలను ఏర్పాటు చేసి లక్షల్లో బిల్డింగ్ రెంటు కొడుతున్నారు కానీ శాశ్వత స్థలాల కేటాయింపు భవన నిర్మాణాలు చేపట్టలేదని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి యస్ యూ నాయకులు అంజి,చందు,దివేందర్,సాయినాథ్,దేవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.