గౌడ విద్యార్థిని విద్యార్థులు భారీగా తరలిరావాలి
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

గౌడ విద్యార్థినీ విద్యార్థులు భారీగా తరలి రావాలి
కామారెడ్డి యువతరం ప్రతినిధి;
జిల్లా కేంద్రంలో ఈనెల 9న ఆదివారం గౌడ జాతి విద్యార్థినీ విద్యార్థులకు జరిగే ప్రతిభ పురస్కారాల అవార్డు ఫంక్షన్ కు భారీ ఎత్తున గౌడ జాతి విద్యార్థిని విద్యార్థులు తరలిరావాలని జై గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు బుంబోతుల లింగా గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రంగోల మురళి గౌడ్ బుధవారం పిలుపునిచ్చారు. పట్టణంలోని విజయదుర్గా రెస్టారెంట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. పదవ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన గౌడ విద్యార్థిని విద్యార్థులు మరియు ఇంటర్మీడియట్ లో రాష్ట్రస్థాయి 20వ ర్యాంకు లోపు సాధించిన విద్యార్థినీ విద్యార్థులు తమ పేర్లను 9440760879, 9492874011, 9177842777, 7981421185, 9640007129 నంబర్లకు తమ వివరాలను పంపించి నమోదు చేసుకోవాలన్నారు. ఇట్టి కార్యక్రమానికి జై గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు వట్టికూడి రామారావు గౌడ్ మరియు ఉద్యమ సంఘాల నేత చక్రవర్తి గౌడ్ లు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ సంఘం జిల్లా ముఖ్య నాయకులు బండారి సాయిరాం గౌడ్, రవికుమార్ గౌడ్ ,ముగ్గుల్ల రామా గౌడ్, అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్ , బొంబోతుల నరేష్ గౌడ్ ,కర్రోల్ల శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.