
యోగ ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది
యోగ ప్రతి వ్యక్తికి అవసరం..
యోగా చేయడంతో అనేకమైన వ్యాధులు తొలగిపోతాయి..
యోగ జిల్లా అధ్యక్షులు రామ్ రెడ్డి
5:30 బ్యాచ్ ఆధ్వర్యంలో రామ్ రెడ్డికి సన్మానంచేశారు…
రామారెడ్డి యువతరం విలేఖరి;
రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం రోజున తొలి ఏకాదశి సందర్భంగా పతాంజలి యోగ జిల్లా అధ్యక్షులు రామ్ రెడ్డి రామారెడ్డి యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కి యోగ అవసరం అని మనము ప్రతిరోజు ఉదయము బ్రహ్మ ముహూర్తంలో.4. గంటల లోపు నిద్రలేచినట్లైతే మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని మరియు ఆరోగ్యంగా ఉంటామని ఆయన అన్నారు. యోగా చేయడం వల్ల జ్ఞాపక శక్తి మరియు శరీరంలో మనకు మానసిక ఒత్తిడిలో ఉన్నట్లయితే తొలగిపోయే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు యోగాను నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు యోగా చేయడం వలన రాబోయే తరానికి ఆదర్శంగా ఉండాలని జిల్లా అధ్యక్షులు రామ్ రెడ్డి తెలిపారు. రామారెడ్డి యోగ గురువు బాలరాజు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థులు ప్రతిరోజు యోగా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు అరటిపండ్లు పంచిపెట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో రామారెడ్డి సర్పంచ్ దండబోయిన సంజీవ్. గుర్జా కుంట స్వామి. సామల రాజేశ్వర్. డర్ని ప్రవీణ్ కుమార్. లక్ష్మా గౌడ్. బాల్ దేవ్ అంజయ్య. పడిగెల శ్రీనివాస్. భైరవ గౌడ్. కడెం శ్రీకాంత్. మెడికల్ శ్రీనివాస్. సందీప్. పశుపతి. గణేష్. దేవిదాస్. కృష్ణమూర్తి. మధుసూదన్. లింబ గౌడ్. శ్రీకాంత్. 5:30 బ్యాచ్ సభ్యులు పతాంజలి యోగ జిల్లా అధ్యక్షులు రామ్ రెడ్డిని సన్మానించారు ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.