
గోదావరి వరదల నుండి ప్రజల్ని కాపాడండి
సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు.
భద్రాద్రి జిల్లా, యువతరం ప్రతినిధి.
భద్రాద్రి జిల్లా :ఈ సంవత్సరం జులై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో గోదావరి వరదలు చాలా తీవ్రంగా ఉంటుందని
సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు.
సారపాక సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశం సందర్భంగా బత్తుల మాట్లాడుతూ.. 2022లో గోదావరి జులై నెలలో బూర్గంపాడు మండల ప్రజల్ని రైతులని తీవ్ర నష్టానికి గురిచేసింది.
అందుకోసం ఈ సంవత్సరం అలాంటి పరిస్థితులు రాకుండా మండల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని
నష్టపోకుండా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. మలేరియా, డెంగ్యూ, విశ్వ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది అందుకు హెల్త్ ఆరోగ్య అధికారులు గ్రామాలు వారిగా వెల్త్ క్యాంపులు పెట్టాల్సిన అవసరం ఉందని
ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ప్రజలకి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి అప్పారావు, శ్రీను,సిహెచ్ రమణయ్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.