బాధిత కుటుంబానికి ఎన్ఆర్ఐ ప్రసాద్ కూనరపు వితరణ

బాధిత కుటుంబానికి ఎన్. ఆర్. ఐ ప్రసాద్ కూనరపు వితరణ
భద్రాద్రి జిల్లా ,యువతరం ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలం పినపాక కు చెందిన కొమరం రామచంద్ర మూర్తి (49) ఆదివాసీ రైతువిద్యుత్ ఘాతానికి గురై ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మండల పరిధి గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఎన్నారై కునారపు ప్రసాద్ రూ.2500 విలువైన 50 కేజీల బియ్యం వితరణ గా ఇవ్వగా పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ చేతుల మీదుగా సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.అలాగే తోగూడెం ఉప సర్పంచ్ బుసి శ్రీనివాసరావురూ 1000 ఆర్థిక వితరణ అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక సర్పంచ్ గోగ్గేల నాగేశ్వరరావు,వార్డు మెంబర్ ఉడుగుల రామచంద్రు, ఎన్ ఆర్ ఐ ప్రసాద్ కుటుంబ సభ్యులు కూనారపు బక్కయ్య, కూనారపు రాములు,కూనారపు సత్యనారాయణ,కొత్త దామోదర్ గౌడ్,బీఆర్ ఎస్ పినపాక నియోజకవర్గం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బండ మనోజ్ కుమార్ రెడ్డి,, స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.