పిల్లలు జర జాగ్రత్త !

పిల్లలు జర జాగ్రత్త !
కోడుమూరు ఏప్రిల్ 11 యువతరం న్యూస్:
కోడుమూరు పట్టణంలో స్థానిక సంత మార్కెట్లో ఉన్న ప్రధాన రహదారిలో ప్రమాదం నోరు తెరుచుకుంది. ప్రధాన కాలువ కు గతంలో పారిశుధ్య పనుల నిమిత్తం కాలువకు గండిపెట్టారు. కొన్ని రోజులకు గ్రామపంచాయతీ అధికారులు ఈ రంధ్రంపై ఇనుప కడ్డీలతో తయారుచేసిన కిటికీని అమర్చారు. కానీ ఆ ఇనుప కడ్డీలపై భారీ వాహనాలు వెళ్లడంతో ఆ కడ్డీలు పాడైపోయి పూర్తిగా దెబ్బతింది. ఈ విధంగా కాలువకు రంద్రం ఉండడంతో, పక్కనే పాఠశాల ఉన్నందున పిల్లలు రంధ్రం చుట్టూ ఆడుకుంటూ ఉంటున్నారు. అనుకోకుండా పిల్లలు అందులో పడే అవకాశం ఉంది. ప్రతి శనివారం కోడుమూరులో సంత అదే ప్రదేశంలో ఉండడంతో పట్టణంలోని ప్రజలు సంతకు వస్తూ ఉంటారు. అంతేకాకుండా రాత్రి సమయంలో కూడా కొన్నిసార్లు వాహనాలు కూడా అందులో పడి చిన్న ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ప్రజా ప్రతినిధులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ కాలువకున్న కన్నం పై శాశ్వత పరిష్కారం చేయాలని, ప్రజలకు హాని నుంచి కాపాడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.



