
మధురవాడలో ఘోరం
ప్రియుడి హత్యకు ప్రియురాలి స్కెచ్
ఉత్తరాంధ్ర ప్రతినిధి ఏప్రిల్ 9 యువతరం న్యూస్:
ఆత్మహత్యగా భావించిన ఓవ్యక్తి మృతి కేసులో అసలు నిజాలను పీఎంపాలెం పోలీసులు వెలికితీశారు వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ పక్కా ప్లాన్ మర్డర్ మిస్టరీని ఛేదించి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మృతుడు అప్పుఘర్ ప్రాంతానికి చెందిన క్యాటరింగ్ వంట మాస్టర్ ఉమాశంకరరావు (51). మధురవాడ శివశక్తినగర్‌కు చెందిన రాజాన రాజేశ్వరితో ఉమాశంకర్‌కు 13 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే, రాజేశ్వరి ఇటీవల తేజ అనే మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుండటంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 1వ తేదీన పథకం ప్రకారం ఉమాశంకర్‌ను తన ఇంటికి పిలిపించిన రాజేశ్వరి.. తన సోదరుడు వాసు, ప్రియుడు తేజతో కలిసి అతడిని హతమార్చింది. అనంతరం పోలీసులను నమ్మించడానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించి ఆసుపత్రికి తరలించారు.తన భర్త మృతిపై అనుమానం ఉందని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీఎంపాలెం సీఐ జి. బాలకృష్ణ ఆధ్వర్యంలో సాంకేతిక ఆధారాలతో విచారణ జరపగా నిందితులు తప్పు ఒప్పుకున్నారు.నిందితులు రాజాన రాజేశ్వరి, వాసు, తేజలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.



