ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

జిల్లాలో త్రాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొని నీటిని అందించాలి

రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

జిల్లాలో త్రాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొని నీటిని అందించాలి

అధికారుల నిర్లక్ష్యం వల్ల నీటి కొరత రాకూడదు

రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

ఉరవకొండ ప్రతినిధి ఏప్రిల్ 03 యువతరం న్యూస్:

వేసవిలో త్రాగునీటి ఎద్దడిని జిల్లాలో సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి ఒక్కరికి నీటిని అందించాలని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు, కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో శుక్రవారం వేసవి నేపథ్యంలో ఎదురయ్యే త్రాగునీటి ఎద్దడి, నివారణ చర్యలపై ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎస్పీడీసీఎల్, సత్యసాయి వాటర్ బోర్డ్ అధికారులతో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ తో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు,ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులు సమర్థవంతంగా సమన్వయంతో పని చేసి త్రాగునీరు అందించాలని అన్నారు. ముందస్తుగా నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, జేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే, దానికి సంబంధిత అధికారులు మరియు సూపర్‌వైజరీ అధికారులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. ​అధికారుల నిర్లక్ష్యం వల్ల నీటి కొరత రాకూడదన్నారు. బోర్ల జియో ట్యాగింగ్ కు సంబంధించి 100 బోర్లకు జియో ట్యాగింగ్ పూర్తయిందని ఆర్డబ్ల్యుఎస్ అధికారులు నిర్ధారించగా, ​ప్రతి బోరు ఎక్కడ ఉంది మరియు దాని ప్రస్తుత స్థితి (పనిచేస్తోందా లేదా అనేది) గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉందా అని ఆరా తీశారు. అవసరమైతే అధికారులు మూడు నెలల పాటు ఆయా నియోజకవర్గాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం సర్పంచులు లేనందున, ప్రత్యేక అధికారులు నీటి సరఫరా బాధ్యతను తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని బిల్లుల సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. ప్రధానంగా వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మరియు అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. శ్రీ సత్యసాయి త్రాగు నీటి పథకం కింద గత ప్రభుత్వం మిగిల్చిపోయిన బకాయిలు సుమారు 60 కోట్లు కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 41 కోట్లు విడుదల చేసామని స్పష్టం చేశారు. అత్యవసరమైన వాటికి ఎంత అవసరం అయితుందో తెలపాలని అన్నారు.

ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, సత్యసాయి వాటర్ బోర్డ్ డిఈ రామారావు, మెంబర్ సెక్రెటరీ ప్రభాకర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ డిఈలు, తదితరులు పాల్గొన్నారు

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!