

ఆత్మవిశ్వాసమే విజయానికి తొలి అడుగు
కర్నూల్ అదనపు ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా
ఏకాగ్రత, పట్టుదలతో ముందుకు సాగండి
విద్యార్థినుల భద్రత, ఆత్మరక్షణపై అవగాహన
కర్నూలు ప్రతినిధి మార్చి 05 యువతరం న్యూస్:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు పట్టణం , కప్పల్ నగర్ లోని చైతన్య స్కూల్ విద్యార్థినులకు భద్రత, ఆత్మరక్షణ పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఆత్మవిశ్వాసం (సెల్ఫ్ కాంఫిడెన్స్ ) అత్యంత ముఖ్యమన్నారు.
కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలంటే నిరంతర సాధన అవసరమని, ఏకాగ్రతతో కృషి చేస్తే లక్ష్యాలను సులభంగా సాధించవచ్చన్నారు.
మనసును దృఢంగా ఉంచుకుని, పట్టుదలతో ముందుకు సాగాలన్నారు.
విద్యార్థులు తమపై నమ్మకం పెంచుకుంటూ ప్రతిరోజూ సాధన చేస్తే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందన్నారు.
బాధ్యతగల పౌరులుగా ఎదగాలని, విద్యతో పాటు మంచి నైతిక విలువలను అలవర్చుకోవాలన్నారు.
బాలికలు అన్ని రంగాల్లో రాణించగల సామర్థ్యం కలవారని, ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.
ఆత్మరక్షణ విద్య ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా నేర్చుకోవాలని కరాటే మాస్టర్లు సూచించారు.
ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆత్మరక్షణ పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శన (డెమో) నిర్వహించి ఆత్మరక్షణ నిమిత్తం పాటించాల్సిన ముఖ్యమైన టెక్నిక్స్ విద్యార్థులకు చూపించారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు మహిళా పియస్ సిఐ రామయ్యనాయుడు, కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజా రావు, టూ టౌన్ ఎస్సై శివాంజల్, చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ మంజుల, చైతన్య స్కూల్ ఎఓ పరమేశ్వర్ రెడ్డి, కరాటే మాస్టర్స్ శ్రీనివాసులు, ఫాతిమా, చైతన్య స్కూల్ ఉపాధ్యాయులు,150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.



