ఛత్రపతి శివాజీ మహరాజ్ యువతకు ఆదర్శం


ఛత్రపతి శివాజీ మహరాజ్ యువతకు ఆదర్శం
మంత్రాలయం ప్రతినిధి ఫిబ్రవరి 20 యువతరం న్యూస్:
ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు హామీ ఇచ్చారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ ను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు సూచించారు. గురువారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని స్థానిక యువత ఆధ్వర్యంలో హైస్కూల్ నుండి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వరకు భారీ ఊరేంపుతో డిజె సౌండ్ తో బాణ సంచా పేల్చి సంబరాలతో జరుపుకున్నారు. స్థానిక శ్రీ మఠం ఆవరణంలో శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు జండా ఊపి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ భక్తి ధైర్య సాహసాలు యువతలో అలువరుచుకోవాలని హితవు పలికారు. హిందువులు అందరూ గర్వించదగ్గ వ్యక్తి ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ఆయన అడుగు జాడలో నడవాలని కోరారు. అనంతరం రాఘవేంద్ర సర్కిల్ మీదుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణం వరకు ఊరేగించారు.. అనంతరం అన్నదం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ టౌన్ అధ్యక్షులు వరదరాజు, ఎంపీటీసీ వెంకటేష్, పులికుక్క రాఘవేంద్ర, ఎస్ రాఘవేంద్ర, శివ, పేగుల రాము ఎటిఎం భీమేష్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సి సునీల్ కుమార్,
నీలకంఠ , ఫణింద్ర, ప్రాణేష్ నరసింహలు, రమేష్, సి చక్రీ, శ్రీ రామ్, గురు ప్రసాద్, వెంకట కృష్ణ తో పాటు సుమారు 5 వందల మంది యువకులు పాల్గొని జయప్రదం చేశారు.



