హెల్ది హెల్దీ హ్యాపీ సొసైటీని నిర్మించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం
మంత్రి అనగాని


హెల్ది హెల్దీ హ్యాపీ సొసైటీని నిర్మించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం
ప్లాస్టిక్ రీసైక్లింగ్ మిషన్లు త్వరలో ప్రజలకు అందుబాటులోకి
రేపల్లె జనవరి 24 యువతరం న్యూస్:
హెల్తి హెల్తి హ్యాపీ సొసైటీని నిర్మించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపు ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రతి నెల మూడవ శనివారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రేపల్లె పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ జగన్ రెడ్డి పేర్చిన 84 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించడానికి ఏడాది సమయం పట్టిందని తెలిపారు. రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలతో స్వచ్ఛంద కార్పొరేషన్ ఆహ్లాదకర వాతావరణము కల్పిస్తున్నదన్నారు. తడి చెత్త, పొడి చెత్త విడదీసి రీసైకిలింగ్ చేస్తున్నామన్నారు. రేపల్లెలోని చెత్తను విద్యుత్ ప్లాంట్ కు పంపిస్తున్నామని తెలిపారు. త్వరలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ మిషన్లు కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. తొలుత రేపల్లె పట్టణంలోని రాజ్యలక్ష్మి సెంటర్ నుండి ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు విద్యార్థులు స్థానిక ప్రజలు వివిధ ప్రజా సంఘాలతో నిర్వహించిన స్వచ్ఛ – ప్రదర్శనలో ఎంపీ కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్సిసి క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించి మొక్కలు నాటారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జూట్ స్టాల్స్ ను ఈ వేస్ట్ కలెక్షన్స్ సెంటర్లను సందర్శించారు. పొడి చెత్త వేరు చేసే ప్రక్రియను పరిశీలించారు. రేపల్లె పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ గా తీర్చిదిద్దుకుందాం అంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రూ 29 లక్షల నిధులతో ఆధునీకరించిన తరగతి గదులు ల్యాబ్లు, గార్డెనింగ్ ప్రారంభించారు. యువత భవిష్యత్తు కోసమే చంద్రబాబు, లోకేష్ కష్టపడుతున్నారని అనగాని తెలిపారు. కార్యక్రమాల్లో కృష పచ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్, ఆర్డిఓ ఎన్ రామలక్ష్మి, నియోజకవర్గ జనసేన పిఓసి మత్తి భాస్కరరావు, కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.



